‘స్నాప్ఛాట్’ ఫోటో షేరింగ్ యాప్ పేరెంట్ కంపెనీ అయినా ‘స్నాప్’ కంపెనీ తన కొత్త ప్రోడక్ట్ “Spectacles 3” కళ్ళజోడుని యూస్ మార్కెట్ లోకి లాంచ్ చేయబోతుంది. దీని ధర ఎంతో గెస్ చెయ్యండి చూద్దాం? అక్షరాలా రూ.27,000! వామ్మో ఒక కళ్ళజోడు అంత కాస్టలీ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది మాములు కళ్ళజోడు కాదు మరి! దీనికి 3డీలో ఫొటోస్ మరియు వీడియోస్ తీసే సామర్ధ్యం ఉంది. కళ్లజోడుకి రెండు వైపులా రెండు హెచ్‌డీ కెమెరాల్ని నిక్షిప్తం చేశారు. మనం ఎలాగైతే చూస్తామో అదే యాంగిల్‌లో అగ్మెంటెడ్‌ రియాలిటీ(AR) సపోర్టుతో ఫొటోలు, వీడియోల్ని 3డీలో షూట్‌ చేయొచ్చు. ఇలా చిత్రీకరించిన వాటిని స్మార్ట్‌ఫోన్‌కి సింక్‌ చేసేలా, కళ్లజోడు వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌తో పని చేస్తుంది. మీకు నచ్చినవాటిని ‘స్నాప్‌ఛాట్‌’ వేదికగా ప్రపంచంతో పంచుకోవచ్చు. అది సంగతి. అందుకే అంత ధర!